Macharla Niyojaka Vargam - దర్శకుడిగా మారిన ఎడిటర్!

Saturday,September 11,2021 - 04:19 by Z_CLU

నితిన్  హీరోగా తెరకెక్కనున్న ‘మాచర్ల నియోజక వర్గం’ సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాతో కత్తెర వదిలేసి మెగా ఫోన్ పట్టబోతున్నాడు SR శేఖర్. దాదాపు 70కి పైగా సినిమాలకు ఎడిటర్ గా వర్క్ చేసిన ఎక్స్ పీరియన్స్ తో ఈ సినిమాను డైరెక్ట్ చేసి టాలీవుడ్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరడానికి రెడీ అవుతున్నాడు.

నితిన్ 31వ సినిమాగా రానున్న ఈ సినిమాకు మాచర్ల నియోజిక వర్గం అనే డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేయడంతో ఓపెనింగ్ నుండే సినిమాపై మోస్తారు అంచనాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా అక్టోబర్ నుండి రెగ్యులర్ షూట్ జరుపుకోనుంది. ఈ సినిమాతో నితిన్ కి కొత్తగా చూపించాలని భావిస్తున్నాడు దర్శకుడు శేఖర్. ఈ సినిమా నితిన్ సొంత ప్రొడక్షన్ శ్రేష్ట్ మూవీస్ లోనే రూపొందనుంది.

ఇక వచ్చే వారం అంధదూన్ రీమేక్ ‘మాస్ట్రో’ తో ప్రేక్షకుల ముందుకు రానున్న నితిన్ నెక్స్ట్ సినిమా ఇదే. ఈ సినిమా తర్వాత లైనప్ లో ఉన్న సినిమాలను కూడా ఒక్కక్కటిగా ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు నితిన్. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. అప్పటి కల్లా షూటింగ్ తో పాటలు ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు.