నితిన్ సినిమా అప్ డేట్స్

Monday,October 15,2018 - 10:10 by Z_CLU

నెక్స్ట్ సినిమాకు రెడీ అవుతున్నాడు నితిన్… ‘ఛలో’ ఫేం వెంకీ కుడుముల డైరెక్షన్ లో సినిమా చేయబోతున్న నితిన్ ఈ సినిమాలో రష్మిక తో రొమాన్స్ చేయబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను నవంబర్ లో లాంచ్ చేసి డిసెంబర్ నుండి రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేయాలనీ భావిస్తున్నారు మేకర్స్.

ఈ సినిమా తర్వాత ‘RX 100’ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతితో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు నితిన్.. ప్రస్తుతం ఈ రెండు సినిమాల మీదే ఫోకస్ పెట్టిన నితిన్ ఈ సినిమాలు పూర్తయ్యాక తన బ్యానర్ లో సినిమా చేయనున్నాడు.