నితిన్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్

Monday,February 05,2018 - 04:18 by Z_CLU

ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది నితిన్ కొత్త సినిమా. కృష్ణ చైతన్య డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అవుతుంది. అయితే రానున్న వ్యాలెంటైన్ సీజన్ లో మరింత లవ్ మ్యాజిక్ ని స్ప్రెడ్ చేసే ఆలోచనలో ఉంది ఈ సినిమా యూనిట్.

అల్టిమేట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఫిబ్రవరి 12 న, టీజర్ ని ఎగ్జాక్ట్ గా వ్యాలెంటైన్ డే రోజు రిలీజ్ చేయనున్న సినిమా యూనిట్, యూత్ ని ఎట్రాక్ట్ చేసే ప్లాన్ లో ఉన్నారు. రీసెంట్ గా ‘లై’ లాంటి డిఫెరెంట్ ఎంటర్ టైనర్ తో మెస్మరైజ్ చేసిన నితిన్, ఈ సినిమాలో ఎలా కనిపించనున్నాడోనన్న క్యూరాసిటీ  ఆల్ రెడీ ఫ్యాన్స్ లో బిగిన్ అయిపోయింది.

నితిన్ సరసన మేఘా ఆకాష్ నటిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాన్, త్రివిక్రమ్ తో పాటు సుధాకర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.