నితిన్ ‘లై’ మూడో సింగిల్

Tuesday,August 01,2017 - 05:58 by Z_CLU

‘లై’ ఫీవర్ రోజురోజుకి పెరిగిపోతుంది. ఫస్ట్ సింగిల్ ‘బొంబాట్’ తోనే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయడం బిగిన్ చేసిన ఈ సినిమా, ఆ తర్వాత రిలీజైన ‘మిస్ సన్ షైన్’ తో మోస్ట్ అవేటెడ్ మూవీగా మారిపోయింది. ఈ రెండు సింగిల్స్ కి తోడు ఈ రోజు ‘ లగ్గం టైమ్’ అనే మరో సింగిల్ రిలీజ్ అయింది. ఈ సింగిల్ అలా సోషల్ మీడియాలో రిలీజైందో లేదో ట్రెండింగ్ క్యాటగిరీలోకి చేరిపోయింది.

సాంగ్ బిగినింగ్ నిండి ఎండింగ్ వరకు ఇంటరెస్టింగ్ గా ఉన్న ‘లగ్గం టైమ్’ లిరిక్స్ ని గమనిస్తే, ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ కనీసం ఒకరినొకరు కలుసుకోకముందు ప్లాన్ చేసిన సాంగ్ అని అర్థమైపోతుంది. దాంతో పాటు మరీ కంప్లీట్ గా కాకపోయినా, ఈ సాంగ్ తో ఈ ఇద్దరి క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుందో తెలిసిపోతుంది.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయిపోయిన మణిశర్మ, ఈ సాంగ్స్ తో తన మార్క్ ని పర్ ఫెక్ట్ గా ఎలివేట్ చేస్తున్నాడు. ఇక ‘లై’ సినిమా విషయానికొస్తే, సినిమా సక్సెస్ కి కావాల్సిన మ్యాగ్జిమం అటెన్షన్ ని గ్రాబ్ చేసేస్తుంది ‘లై’.  హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా, ఆగష్టు 11 న రిలీజ్ కి రెడీ అవుతుంది.