నితిన్ 'లై' మూవీ అప్డేట్స్

Thursday,April 20,2017 - 11:00 by Z_CLU

యూత్‌స్టార్‌ నితిన్‌ హీరోగా వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘లై’ (లవ్‌ ఇంటెలిజెన్స్‌ ఎన్‌మిటి). అమెరికాలోని వివిధ లొకేషన్స్‌లో ఈ సినిమా షూటింగ్ నాన్‌స్టాప్‌గా జరుగుతోంది.

నితిన్ సరసన మేఘా ఆకాష్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అర్జున్ ఓ కీ రోల్ లో నటిస్తున్నాడు.. ప్రెజెంట్ అమెరికాలోని డిఫరెంట్‌ లొకేషన్స్‌ వెగాస్‌, లాస్‌ ఏంజిలిస్‌, శాన్‌ఫ్రాన్సిస్కో, చికాగో వంటి బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో జూన్‌ రెండో వారం వరకు షూటింగ్‌ జరుగుతుంది. దీంతో 90 శాతం షూటింగ్‌ పూర్తవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్ట్‌ 11న ఈ సినిమాను వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.