పవన్ సినిమాను డిస్ట్రీబ్యూట్ చేస్తున్న యంగ్ హీరో....

Saturday,February 11,2017 - 06:14 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సినిమా ‘కాటమరాయుడు’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. డాలీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా మార్చ్ 29 న రిలీజ్ కానున్న ఈ సినిమాను యంగ్ హీరో నితిన్ డిస్ట్రీబ్యూషన్ చేయబోతున్నాడట…

nithiin-tweet-about-katamarayudu
నితిన్ కి పవన్ తో ఉన్నఅనుబంధం అందరికీ తెలిసిందే. పవన్ ఇష్టపడే యంగ్ హీరోలలో నితిన్ మొదటి స్థానం లో ఉంటాడనేది స్పెషల్ గా చెప్పనక్కరేల్దు కూడా. ఆ రిలేషన్ షిప్ తోనే తన అభిమాన హీరో నటిస్తున్న ‘కాటమరాయుడు’ సినిమా ను నైజం ఏరియాలో డిస్ట్రీబ్యూట్ చేయబోతున్నాడట నితిన్. లేటెస్ట్ ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా పవన్ అభిమానులతో పంచుకున్నాడు నితిన్.