Nithin - కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్

Thursday,October 01,2020 - 06:59 by Z_CLU

నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకం పైవి.ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి ‘చెక్’ (Check) అనే టైటిల్ ఖరారు చేశారు. ఇందులో రకుల్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

‘చెక్’ టైటిల్, ప్రీ లుక్ పోస్టర్ ని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఆవిష్కరించారు. చదరంగం నేపథ్యంలో సాగే ఓ ఉరిశిక్ష పడ్డ ఖైదీ కథ ఇది. ఉరిశిక్ష పడిన ఖైదీగా Nithin కనిపిస్తాడు.

ఈ నెల 12 నుంచి నెలాఖరు వరకూ కొత్త షెడ్యూల్ ప్లాన్ చేశారు. దాంతో దాదాపుగా చిత్రీకరణ పూర్తవుతుంది.

నటీనటులు – నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్, పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, త్రిపురనేని సాయిచంద్, సంపత్ రాజ్, హర్షవర్ధన్, రోహిత్ పాథక్, సిమ్రాన్ చౌదరి