నితిన్ ‘ఛల్ మోహన్ రంగ’ టీజర్

Wednesday,February 14,2018 - 11:31 by Z_CLU

వాలెంటైన్ డే సందర్భంగా నితిన్ ‘ఛల్ మోహన్ రంగ’ టీజర్ రిలీజైంది. ‘లై’ మూవీ తరవాత ఈ సినిమా కోసం మరోసారి జోడీ కట్టారు నితిన్, మేఘా ఆకాష్. కృష్ణ చైతన్య డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ యూత్ ని ఎట్రాక్ట్ చేస్తోంది.

‘మీ స్టోరీ ఏంటి భయ్యా అనగానే… హీరో తన లవ్ స్టేటస్ ని మూడు ముక్కల్లో చెబుతాడు. ఆ డైలాగ్ వింటే ఇదొక రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ అనే విషయం అర్థమౌతోంది. డైలాగ్ చివర్లో పంచ్ వింటుంటే సినిమాలో త్రివిక్రమ్ మార్క్ ఉందనే విషయం కూడా తెలుస్తోంది. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ లో మరో హైలెట్.

త్రివిక్రమ్, పవన్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు మరో నిర్మాతగా నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ 5న ఛల్ మోహన్ రంగ థియేటర్లలోకి రానుంది.