నితిన్ ‘ఛల్ మోహన్ రంగ’ ట్రైలర్ రివ్యూ

Monday,March 26,2018 - 01:46 by Z_CLU

ఏప్రియల్ 5 న గ్రాండ్ గా రిలీజవుతుంది ‘ఛల్ మోహన్ రంగ’. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్. దాంతో యూత్ ఫోకస్ ఈ సినిమాపై ఫిక్స్ అయింది. అల్టిమేట్ హిలేరియస్ లవ్ ఎంటర్ టైనర్ లా తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది.

2: 21 నిమిషాల పాటు ఉండే ఈ ట్రైలర్ లో కామెడీతో పాటు సినిమాలోని ఇమోషనల్ ఆంగిల్ ఎలివేట్ అవుతుంది. ‘’ఊటీలో చలేస్తే కోట్లేసుకోవాలి. మగాళ్ళకి బీట్లేయకూడదు” అనే డైలాగ్ యూత్ ని ఎట్రాక్ట్ చేస్తుంది. ‘లై’ తరవాత మరోసారి జోడీ కట్టిన నితిన్, మేఘా ఆకాష్ కెమిస్ట్రీ మరోసారి మెస్మరైజ్ చేస్తుంది.

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ తో పాటు సుధాకర్ రెడ్డి సంయుక్తంగా పవన్ కళ్యాన్ క్రియేటివ్ వర్క్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్.