గ్రాండ్ గా థియేటర్స్ లో కొచ్చిన ఛల్ మోహన్ రంగ

Thursday,April 05,2018 - 10:02 by Z_CLU

ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు గ్రాండ్ గా రిలీజైంది ఛల్ మోహన్ రంగ. ఫిల్మ్ మేకర్స్ చేసిన ప్రమోషన్స్ తో పాటు.. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ పేర్లు కూడా ఆడ్ అవ్వడంతో, సినిమాపై అందరి దృష్టిపడింది. ఆ బజ్ కు తగ్గట్టే తొలిరోజు ఛల్ మోహన్ రంగకు జనాలు పోటెత్తారు. థియేటర్స్ నుండి సోషల్ మీడియా వరకు ఎక్కడ చూసిన ‘ఛల్ మోహన్ రంగ’ ఫీవర్ కనిపిస్తోంది.

నైజాంలో ఏకంగా 170 స్క్రీన్స్ లో రిలీజైన ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా భారీ ఎత్తున రిలీజ్ అయింది. అల్టిమేట్ హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కే భారీ ఎత్తున కలెక్ట్ చేసే చాన్సెస్ ఉన్నాయంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

ఇక మొదటి రోజు మొదటి ఆటకు పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమాలో కామెడీ బ్రహ్మాండంగా ఉందనే టాక్ సోషల్ మీడియాలో కనిపిస్తోంది.

తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాని శ్రేశ్ఠ్ మూవీస్ తో పాటు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మించారు. మేఘా ఆకాష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకి కృష్ణ చైతన్య డైరెక్టర్.