ఈనెల 24న ‘ఛల్ మోహన రంగ’ ఫస్ట్ సింగిల్

Wednesday,February 21,2018 - 06:24 by Z_CLU

హీరో నితిన్ అప్ కమింగ్ మూవీ ఛల్ మోహన్ రంగ. ఈ సినిమాకు సంబంధించి ఆడియో రిలీజ్ ప్రాసెస్ కు డేట్ ఫిక్స్ చేశారు. ఈనెల 24 నుంచి ఛల్ మోహన్ రంగ సింగిల్స్ ను దశలవారీగా విడుదల చేయబోతున్నారు. 24న ‘గ… ఘ… మేఘా…’ అనే లిరిక్స్ తో సాగే లిరికల్ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేస్తారు. ఇక అక్కడ్నుంచి దశలవారీగా సినిమా సాంగ్స్ అన్నీ రిలీజ్ అవుతాయి.

24నే పాటల విడుదల కార్యక్రమం పెట్టడానికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. నితిన్ కెరీర్ ను మలుపుతిప్పిన ఇష్క్ సినిమా సరిగ్గా ఆరేళ్ల కిందట అదే రోజున విడుదలైంది. అందుకే సెంటిమెంట్ కొద్దీ ఆరోజు నుంచి ఛల్ మోహన్ రంగ సాంగ్స్ ను విడుదల చేయాలని నిర్ణయించారు.

ఇక ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ కూడా ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను విశాఖలో సెలబ్రేట్ చేయాలని అనుకుంటున్నారు. ప్రస్తుతానికి ఇది గాసిప్ లెవెల్లోనే ఉన్నప్పటికీ.. నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

రీసెంట్ గా రిలీజైన ‘చల్ మోహన్ రంగ’ టీజర్ యూత్ ని ఇంప్రెస్ చేస్తోంది. ఏప్రియల్ 5 న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ కంప్లీట్ చేసుకుంటోంది. త్రివిక్రమ్, పవన్ తో కలిసి నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.