నిన్నుకోరి రిలీజ్ డేట్ ఫిక్సయింది

Friday,April 21,2017 - 03:12 by Z_CLU

నాని నిన్నుకోరి షూటింగ్ మ్యాగ్జిమం క్లైమాక్స్ స్టేజ్ లో ఉంది. ఈ నెల 29 వరకు జరిగే షెడ్యూల్ తో దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకోనున్న సినిమా యూనిట్, ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసి అనౌన్స్ చేసేసింది. శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నివేదా థామస్ హీరోయిన్ గా నటిస్తుంది.

రీసెంట్ గా అమెరికాలో భారీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న సినిమా యూనిట్ ప్రస్తుతం వైజాగ్ లో మరికొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించే పనిలో ఉంది. పక్కా ప్లానింగ్ తో షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంటున్న ‘నిన్ను కోరి’ టీమ్  జూన్ 23 న సినిమాని రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది. ఆది కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాకి గోపీసుందర్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.