నిన్నుకోరి ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్సయింది

Sunday,June 18,2017 - 12:44 by Z_CLU

నాని ‘నిన్ను కోరి’ రోజు రోజుకు పెరుగుతూనే నిన్న రిలీజైన ట్రేలర్ కనీసం 24 గంటలు కూడా గడవక ముందే  5 మిలియన్ వ్యూస్ ని దాటేసిందంటే ఈ సినిమాకి ఏ రేంజ్ లో డిమాండ్ క్రియేట్ అయిందో తెలుస్తుంది. అయితే ఆ క్రేజ్ ని రెండింతలు చేసే ప్రయత్నంలో సినిమా యూనిట్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ని అనౌన్స్ చేసేసింది.

ఈ నెల 29 న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేయనుంది ‘నిన్నుకోరి’ టీమ్. ఇప్పటికే రిలీజైన రెండు పాటలు, ట్రేలర్ ఈ సినిమా మాన్ సూన్ సీజన్ కి పర్ ఫెక్ట్ ఎంటర్ టైనర్ అనిపిస్తున్నాయి.  శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని జూలై 7 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్.