Blockbuster Karthikeya 2 - అందరికీ థాంక్స్ చెప్పిన నిఖిల్

Sunday,August 14,2022 - 01:13 by Z_CLU

Nikhil’s Reaction on Karthikeya2 Success

ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, డైరక్టర్ చందు మొండేటి కాంబోలో కార్తికేయకి సీక్వెల్ గా వచ్చిన చిత్రం కార్తికేయ‌ 2. రీసెంట్ గా ప్రేక్షకులు ముందుకు వచ్చిన కార్తికేయ -2 చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టయింది. అన్ని చోట్ల నుండి అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా కార్తికేయ- 2 హీరో ప్రేక్షకులకు థాంక్స్ చెప్పాడు..

హీరో నిఖిల్ మాట్లాడుతూ…
“ఈ సినిమాకి యూఎస్ నుంచి ముందుగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ కంప్లీట్ రిజల్ట్ కోసం వెయిట్ చేసాం. ఇక్కడ సినిమా షో అవ్వగానే నాకు ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. అన్నీ చోట్ల హౌస్ ఫుల్ అవుతున్నట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. నా సినిమా హిట్ అవ్వాలని చాలామంది కోరుకున్నారు. ఈ వీకెండ్ తో పాటు, ఆగస్ట్ 15న కూడా బుకింగ్స్ బాగున్నాయి. ఇది ఇలానే కొనసాగుతుంది అని నేను అనుకుంటున్నాను. చందు మంచి పాయింట్ తీసుకుని అద్భుతంగా తీసాడు. కార్తికేయ2 ను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్. “

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై తెరకెక్కిన కార్తికేయ-2 సినిమాకు నార్త్ బెల్ట్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. కృష్ణతత్వాన్ని, యూనివర్సల్ సబ్జెక్ట్ ను సెలక్ట్ చేసుకోవడంతో.. ఉత్తరాది ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆదరిస్తున్నారు.

ఇవాళ్టి నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటు, నార్త్ లోని కీలకమైన సెంటర్లలో కార్తికేయ-2కు స్క్రీన్ కౌంట్ పెంచుతున్నారు. కార్తికేయ-2 బ్లాక్ బస్టర్ హిట్టవ్వడంతో, కార్తికేయ-3 కూడా తీస్తానంటున్నాడు దర్శకుడు చందు మొండేటి.