చివరి షెడ్యూల్లో నిఖిల్ ముద్ర.. త్వ‌ర‌లో టీజ‌ర్

Monday,January 14,2019 - 10:01 by Z_CLU

యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా తెర‌కెక్కుతున్న యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ముద్ర‌. ఈ చిత్రాన్ని టిఎన్ సంతోష్ తెర‌కెక్కిస్తున్నారు. వాస్త‌విక సంఘ‌ట‌నల ఆధారంగా జ‌ర్న‌లిజం నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న సినిమా ఇది. ముద్ర షూటింగ్ చివ‌రిద‌శ‌లో ఉంది. ఐదు రోజుల టాకీ.. ఓ పాట ఈ నెల‌లో పూర్తి చేయ‌నున్నారు. డ‌బ్బింగ్ వ‌ర్క్స్, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఒకేసారి పూర్తి చేస్తున్నారు.

ఈ చిత్రంలో గ్రాఫిక్స్ వ‌ర్క్స్ కూడా ఉన్నాయి.. దాంతో పాటు భారీ యాక్ష‌న్ సీక్వెన్సులు ఉన్నాయి.. అందుకే కాస్త స‌మ‌యం ఎక్కువ‌గా తీసుకుంటున్నట్టు ప్రకటించాడు నిఖిల్. ఇందులో జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. స్యామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఔరా సినిమాస్ పివిటి, మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్పి బ్యాన‌ర్స్ పై కావ్య వేణుగోపాల్, రాజు కుమార్ నిర్మిస్తున్నారు. బి మ‌ధు ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తున్నారు.

న‌టీన‌టులు:
నిఖిల్ సిద్ధార్థ్, లావ‌ణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ‌ముర‌ళి, ప్ర‌గ‌తి, స‌త్య‌, త‌రుణ్ అరోరా, రాజా ర‌వీంద్ర, నాగినీడు..

సాంకేతిన నిపుణులు:
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: టిఎన్ సంతోష్
స‌మ‌ర్ప‌కుడు: బి మ‌ధు
నిర్మాత‌లు: కావ్య‌ వేణుగోపాల్ మ‌రియు రాజ్ కుమార్
నిర్మాణ‌ సంస్థ‌లు: ఔరా సినిమాస్ పివిటి మ‌రియు మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్‌పి
సినిమాటోగ్ర‌ఫీ: సూర్య
సంగీతం: స‌్యామ్ సిఎస్
ఆర్ట్ డైరెక్ట‌ర్: సాహి సురేష్
ఫైట్స్: వెంక‌ట్
క్యాస్ట్యూమ్ డిజైన‌ర్: రాగా రెడ్డి
డైరెక్ష‌న్ డిపార్ట్ మెంట్: ర‌మా ర‌మేష్, రంగ‌నాథ్, లోకేష్, భ‌ర‌త్, అరు, బ్ర‌హ్మ
ప‌బ్లిసిటీ డిజైన్: అనిల్-భాను