నిఖిల్ 'ముద్ర' ఫస్ట్ లుక్ రిలీజ్

Saturday,June 02,2018 - 01:24 by Z_CLU

తన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశాడు నిఖిల్. ఈ సినిమాకు ముద్ర అనే టైటిల్ అనుకుంటున్నట్టు మొన్నటివరకు ప్రచారం నడిచింది. ఇప్పుడు అదే నిజమైంది. ముద్ర టైటిల్ తోనే ఫస్ట్ లుక్ వచ్చింది.

ఫస్ట్ లుక్ లో మరోసారి ఎగ్రెసివ్ గా కనిపిస్తున్నాడు నిఖిల్. జర్నలిస్ట్ రోల్ లో స్టిల్ కెమెరా పట్టుకొని డాషింగ్ గా ఉన్నాడు. కాకపోతే గతంలో వచ్చిన ఎక్కడికి పోతావ్ చిన్నవాడా, తాజాగా రిలీజైన ముద్ర ఫస్ట్ లుక్స్ రెండూ ఒకేలా ఉన్నాయి.

ఠాగూర్ మధు సమర్పిస్తున్న ఈ సినిమాను మూవీ డైనమిక్స్, ఆరా సినిమాస్ బ్యానర్లపై రాజ్ కుమార్, కావ్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. తమిళ్ లో హిట్ అయిన కణథన్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ముద్రలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. టీఎన్ సంతోష్ దర్శకుడు.