కిరాక్ పార్టీ ట్రయిలర్ రివ్యూ

Wednesday,January 31,2018 - 07:28 by Z_CLU

హీరో నిఖిల్ మరోసారి తన స్పెషాలిటీ చూపించాడు. కథ లేదా క్యారెక్టర్ లో కొత్తదనం లేకపోతే సినిమా కు ఓకే చెప్పని ఈ హీరో, కిరాక్ పార్టీ అంటూ మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఈరోజు ట్రయిలర్ రిలీజ్ చేశారు.

ట్రయిలర్ లో రెండు డిఫరెంట్ గెటప్స్ తో ఎట్రాక్ట్ చేస్తున్నాడు నిఖిల్. ట్రయిలర్ ఫస్టాఫ్ లో కాలేజ్ స్టూడెంట్ గా కనిపించాడు. ఈ లుక్ లో హ్యాపీ డేస్ రోజుల్ని మరోసారి గుర్తుచేశాడు. ఇక ట్రయిలర్ సెకండాఫ్ లో రఫ్ లుక్ తో, కండలతో అదరగొట్టాడు. ఈ రెండు లుక్స్ ఇనిస్టెంట్ గా క్లిక్ అయ్యాయి. ఈ లుక్స్ తో పాటు ట్రయిలర్ లో వచ్చిన, కృష్ణుడు వచ్చాడు.. ఇక కురుక్షేత్రమే అనే డైలాగ్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది.

కన్నడలో సూపర్ హిట్ అయిన కిరాక్ పార్టీ అనే సినిమాకు రీమేక్ ఇది. తెలుగులో కూడా అదే టైటిల్ ను ఉంచారు. సంయుక్త, సిమ్రాన్ పరిన్జా హీరోయిన్లుగా పరిచయమౌతున్న ఈ సినిమాను ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకుడు.