ఫిబ్రవరి 9న నిఖిల్ కిరాక్ పార్టీ రిలీజ్

Saturday,December 09,2017 - 03:22 by Z_CLU

శరణ్ కొప్పిశెట్టిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేస్తున్నాడు నిఖిల్. కన్నడలో పెద్ద హిట్ అయిన కిరిక్ పార్టీకి రీమేక్ ఇది. ఈమధ్యే సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. తాజాగా విడుదల తేదీని ప్రకటించారు. ఫిబ్రవరి 9న కిరాక్ పార్టీని థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. అయితే మూవీకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు.

ఈ సినిమాతో సంయుక్త హెగ్డే, సిమ్రాన్ పరిన్జాలు హీరోయిన్లుగా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. దర్శకుడు చందు మొండేటి ఈ సినిమాకు మాటలు అందిస్తుండగా.. మరో దర్సకుడు సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నాడు. అజనీష్ లోక్ నాథ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.