Nikhil’s ‘Karthikeya 2’ Release date locked
ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్ హీరోగా చందూ మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘కార్తికేయ2’ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నారు మేకర్స్. ‘కార్తికేయ’ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ‘కార్తికేయ 2’ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. కార్తికేయ 2ని ప్రపంచవ్యాప్తంగా జులై 22 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కమర్షియల్ చిత్రాలతో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొనసాగిస్తూ విజయాలు సొంతం చేసుకుంటున్న క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

కార్తికేయ 2 షూటింగ్ మొదలయిన దగ్గర నుంచి ఈ సీక్వెల్ పై ఆసక్తి నెలకొంది. నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీ రోల్ ప్లే చేస్తున్నాడు.
Saviours Emerge in crisis అంటూ ఆ మధ్య విడుదలైన నిఖిల్ బర్త్ డే పోస్టర్‌లో ఉన్న మ్యాటర్ ఆకట్టుకుంది. అదే విధంగా తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో ఇంట్రస్టింగ్ థింగ్ ఏంటంటే డాక్టర్ కార్తికేయ ప్రయాణం. శ్రీకృష్టుడి చరిత్రకి సంబంధించిన ద్వారక, ద్వాపర యుగంలో జరిగింది. ఇప్పటికి ఆ లింక్ లో కార్తికేయ శ్రీ కృష్ణుడి గురించి వెతికే ఒక ప్రయాణం.శ్రీ కృష్ణుడు ఆయనకి సంబందించిన కథలో డాక్టర్ కార్తికేయ అన్వేషణగా శ్రీకృష్ణుడు చరిత్రలోకి ఎంటరవుతూ కనిపిస్తున్నాడు. సినిమాలో భావాన్ని ఈ పోస్టర్ ద్వారా దర్శకుడు చందు మొండేటి ప్రేక్షకుల చూపించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జులై 22న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics