మే 1న నిఖిల్‌ `అర్జున్‌ సురవరం` రిలీజ్

Monday,April 08,2019 - 12:06 by Z_CLU

నిఖిల్‌ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్‌ గా ఠాగూర్‌ మధు సమర్పణలో మూవీ డైనమిక్స్‌, ఔరా ఎంటర్‌ టైన్మెంట్స్‌ బ్యానర్లపై టి. ఎన్‌. సంతోష్‌ దర్శకత్వంలో రాజ్‌ కుమార్‌ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్‌ సంయుక్తంగా
నిర్మించిన చిత్రం ”అర్జున్‌ సురవరం”. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మే 1న విడుదల చేస్తున్నారు.

నిఖిల్ ఈ సినిమాలో అర్జున్ సురవరం అనే జర్నలిస్ట్ పాత్ర పోషించాడు. మీడియా పవర్ ను చాటిచెప్పేలా ఈ సినిమాను తెరకెక్కించారు. తమిళ్ లో హిట్ అయిన కనితన్ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ మూవీలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. వీళ్లిద్దరి కాంబోలో ఇదే ఫస్ట్ మూవీ.

న‌టీన‌టులు:
నిఖిల్ సిద్ధార్థ్, లావ‌ణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ‌ముర‌ళి, ప్ర‌గ‌తి, స‌త్య‌, త‌రుణ్ అరోరా, రాజా ర‌వీంద్ర,
నాగినీడు..
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: టిఎన్ సంతోష్
స‌మ‌ర్ప‌కుడు: బి మ‌ధు
నిర్మాత‌లు: కావ్య‌ వేణుగోపాల్ మ‌రియు రాజ్ కుమార్
నిర్మాణ‌ సంస్థ‌లు: ఔరా సినిమాస్ పివిటి మ‌రియు మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్‌పి
సినిమాటోగ్ర‌ఫీ: సూర్య
సంగీతం: స‌్యామ్ సిఎస్
ఆర్ట్ డైరెక్ట‌ర్: సాహి సురేష్
ఫైట్స్: వెంక‌ట్
క్యాస్ట్యూమ్ డిజైన‌ర్: రాగా రెడ్డి
డైరెక్ష‌న్ డిపార్ట్ మెంట్: ర‌మా ర‌మేష్, రంగ‌నాథ్, లోకేష్, భ‌ర‌త్, అరు, బ్ర‌హ్మ
ప‌బ్లిసిటీ డిజైన్: అనిల్-భాను