Nikhil 18Pages - షూటింగ్ అప్ డేట్స్

Sunday,January 30,2022 - 05:20 by Z_CLU

Nikhil’s 18 Pages Movie Shooting Updates

నిఖిల్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ’18 Pages’ సినిమా ఫైనల్ షెడ్యుల్ జరుపుకుంటుంది. ఇటివలే కొన్ని షెడ్యుల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కోవిడ్ వేవ్స్ కారణంగా ఆలస్యంగా ఫైనల్ షెడ్యుల్ జరుపుకుంటుంది. హైదరాబాద్ లో నిఖిల్ అనుపమ లపై కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారు. పది రోజుల పాటు జరగనున ఈ షెడ్యుల్ తో టోటల్ షూటింగ్ కి ప్యాకప్ చెప్పనున్నారు యూనిట్.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. గీతా ఆర్ట్స్ 2 , సుకుమార్ రైటింగ్స్ బేనర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు గోపి సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. త్వరలోనే సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవ్వనుంది. అలాగే షూటింగ్ పూర్తయిన వెంటనే టీజర్ తో ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతున్నారు.

గతంలో సుకుమార్ రైటింగ్స్ బేనర్ లో పల్నాటి సూర్య ప్రతాప్ తీసిన ‘కుమారి 21f’ సెన్సేషనల్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా సుకుమార్ కథ , కథనంతో ప్రతాప్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి.