#18Pages - నిఖిల్ మూవీ ఫస్ట్ లుక్

Tuesday,June 01,2021 - 12:48 by Z_CLU

సూర్య ప్రతాప్ డైరెక్షన్ లో నిఖిల్ హీరోగా నటిస్తున్న ’18పేజెస్’ ఫస్ట్ లుక్ రిలీజైంది. నేడు నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా సినిమాకు సంబంధించి హీరో హీరోయిన్ స్టిల్ తో ఫస్ట్ లుక్ రివీల్ చేశారు మేకర్స్. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఓ హోర్డింగ్ ద్వారా రివీల్ చేశారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్ బేనర్ పై తెరకెక్కుతున్న ఈ లవ్ స్టోరి నుండి రిలీజయిన ఈ ఫస్ట్ లుక్ ప్రెజెంట్ సోషల్ మీడియాలో అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తుంది.

18 pages first look nithin anupama parameswaran zeecinemalu

ఫస్ట్ లుక్ లో హీరోయిన్ క్యారెక్టర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ కథలో ఆమె పాత్ర చాలా కీలకమని చెప్పకనే చెప్పారు మేకర్స్. “నా పేరు నందిని నాకు మొబైల్ లో అక్షరాలు టైప్ చెయ్యడం కన్నా ఇలా కాగితంపై రాయడం ఇష్టం. టైప్ చేసే అక్షరాలకి ఎమోషన్స్ వుండవు ఎవరు టైప్ చేసినా ఒకేలా ఉంటుంది. కానీ రాసే ప్రతీ అక్షరానికి ఒక ఫీలింగ్ వుంటుంది. దానిపై నీ సంతకం ఉంటుంది.నాకెందుకో ఇలా చెప్పడమే బాగుంటుంది.” అంటూ పోస్టర్ లో నందిని పాత్ర తాలూకు భావాన్ని చెప్తూ నిఖిల్ కళ్ళకు ఓ పేపర్ కట్టి దానిపై అనుపమ పెన్ తో రాసే స్టిల్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశారు టీం.

అయితే ఇది కంప్లీట్ లవ్ స్టోరీ అనుకోలేం. సుకుమార్ రైటింగ్ నుండి ఒక సినిమా వస్తుంది అంటే అందులో కచ్చితంగా ఏదో కొత్తదనం ఉంటుంది. ఈ సినిమాలో కూడా అలాంటి డిఫరెంట్ కాంటేపరరీ ఎలిమెంట్ ఒకటి ఉంటుందని ఇన్సైడ్ టాక్. గతంలో సుకుమార్ నిర్మాణంలో ఆయన రైటింగ్ తో ప్రతాప్ డైరెక్ట్ చేసిన ‘కుమారి 21 f’ సినిమా సెన్సేషనల్ హిట్ సాధించి కొత్త కథలకు స్ఫూర్తి కలిగించింది. మరి ఈసారి ఈ కాంబో సినిమా ఎలా ఉంటుందో చూడాలి. బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఇటివలే నేషనల్ అవార్డు అందుకున్న నవీన్ నూలి ఈ సినిమాకు ఎడిటర్.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics