నిఖిల్ చేతికి రవి తేజ రీమేక్ సినిమా ?

Sunday,November 12,2017 - 10:06 by Z_CLU

ఇటివలే రాజా ది గ్రేట్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మాస్ మహారాజ్ రవి తేజ ప్రెజెంట్ టచ్ చసి చూడు సినిమాను ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు.. ఈ సినిమా ఫినిష్ అవ్వగానే లాస్ట్ ఇయర్ తమిళ్ లో సూపర్ హిట్ గా నిలిచిన కనితన్ సినిమా రిమేక్ లో నటిస్తాడనే టాక్ వినిపించింది.. ఈ రీమేక్ కు రవి తేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడనే వరాతలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇప్పుడు ఈ రీమేక్ సినిమాకు యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ పేరు పినిపిస్తుంది.

ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వరకు జరుపుకుంటున్న ఈ రీమేక్ సినిమాను నిఖిల్ తో తెరకెక్కించబోతున్నారట. నల్లమలపు శ్రీనివాస్, ఠాగూర్ మధు నిర్మించనున్న ఈ సినిమాకు ఒరిజినల్ దర్శకుడు టి.ఎం.సంతోష్ దర్శకత్వం వహించనున్నాడని సమాచారం.