టాక్సీవాలా కి ఆల్ ది బెస్ట్ - నిఖిల్

Thursday,November 15,2018 - 11:23 by Z_CLU

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’ ఈ నెల 17 న థియేటర్స్ లోకి రాబోతుంది.. రాహుల్ డైరెక్షన్ లో ఎస్.కే.ఎన్ నిర్మించిన ఈ సినిమా విడుదల సందర్భంగా టీంకి స్పెషల్ గా విషెస్ తెలిపాడు హీరో నిఖిల్.

విడుదలకి ముందే సినిమా పైరసీ అవ్వడం బాధ కలిగించిందని ఇది చాలా దారుణమని.. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడిన యంగ్ టీంను  ప్రేక్షకులు కచ్చితంగా థియేటర్స్ లోనే చూసి వారిని ప్రోత్సహించాలని పైరసీలో చూడకూడదని ప్రేక్షకులను కోరాడు నిఖిల్..

నిర్మాత ఎస్.కే.ఎన్, డైరెక్టర్ రాహుల్ తనకు చాలా క్లోజ్ అని వాళ్ళు ఈ సినిమాతో పెద్ద హిట్ అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని… అలాగే విజయ్, ప్రియాంకతో పాటు  టోటల్ టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు నిఖిల్.