నిఖిల్ నెక్స్ట్ ప్లాన్స్ ఇవే !

Sunday,December 01,2019 - 12:02 by Z_CLU

ప్రస్తుతం ‘అర్జున్ సురవరం’ సినిమాతో థియేటర్స్ లో సందడి  చేస్తున్న నిఖిల్ త్వరలోనే ‘కార్తికేయ 2’ సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఆ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాతో పాటే మరో సినిమాలు ఫైనల్ చేసుకున్నాడు నిఖిల్.

‘కార్తికేయ 2’ తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వి.ఐ.ఆనంద్ తో ఓ సినిమా , హనుమాన్ అనే మరో సినిమా చేయబోతున్నాడు. సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కనున్న ‘హనుమాన్’ సినిమాకు ఇంకా దర్శకుడెవరనేది తెలియాల్సి ఉంది. ఈ మూడు సినిమాలను వచ్చే ఏడాదిలోనే రిలీజ్ అయ్యేలా పక్కా ప్లానింగ్ తో ఉన్నాడు నిఖిల్. మరి  టార్గెట్ రీచ్ అవుతాడా..లేదా చూడాలి.