'కార్తికేయ 2' షూటింగ్ అప్ డేట్స్

Monday,March 08,2021 - 07:19 by Z_CLU

నిఖిల్ – చందూ మొండేటి కాంబినేషన్లో  తెరకెక్కుతున్న ‘కార్తికేయ2’ షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం గుజరాత్ లోని కొన్ని లోకేషన్స్ లో సన్నివేశాలు తీస్తున్నారు. హీరో నిఖిల్ , హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తో పాటు మరికొందరు నటులు ఈ షెడ్యుల్ లో పాల్గొంటున్నారు. ఇరవై రోజుల పాటు జరిగే గుజరాత్ షెడ్యుల్ తర్వాత హైదరాబాద్ లో రెండో షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారు.

‘కార్తికేయ’ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్నఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో రూపొందుతున్న ఈ సినిమాకు కీరవాణి తనయుడు కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై TG విశ్వ ప్రసాద్ , అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది.

నిఖిల్ సిద్దార్థ్ -చందూ మొండేటి సూపర్ హిట్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.