Karthikeya 2 థియేట్రికల్ ట్రైలర్ రెడీ

Tuesday,August 02,2022 - 05:46 by Z_CLU

Nikhil Siddharth’s ‘Karthikeya 2’ Trailer on Aug 6th

ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వస్తున్న కార్తికేయ‌ 2పై  భారీఅంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ 1 సూపర్బ్ రెస్పాన్స్ అందుకుంది. క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌తో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొన‌సాగిస్తూ విజ‌యాలు సొంతం చేసుకుంటున్న‌ క్రేజీ నిర్మాణ సంస్థ‌లు పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్ పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

‘శాంతను ఇది నువ్వు ఆపలేని యాగం.. నేను సమిధను మాత్రమే.. ఆజ్యం మళ్లీ అక్కడ మొదలైంది.. ప్రాణత్యాగం చేసే తెగింపు ఉంటేనే దీనిని పొందగలం’ అంటూ అదిరిపోయే డైలాగ్స్ తో సాగే ట్రైలర్ 1 ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఆగష్టు 6న కార్తికేయ 2 థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. ట్రైలర్ 1తో ఈ సినిమా పై వచ్చిన అంచనాలకు మించే స్థాయిలో ఈ థియేట్రికల్ ట్రైలర్ ఉండనుందని తెలుస్తుంది.

ఇక కాలభైరవ బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. ప్రతీ ఫ్రేమ్ చాలా అద్భుతంగా చూపించారు సినిమాటోగ్రఫర్ కార్తికే ఘట్టమనేని. టెక్నీషియన్స్‌తో అద్బుతమైన ఔట్ పుట్ తీసుకున్నారు దర్శకుడు చందూ మొండేటి. కార్తికేయకు సీక్వెల్‌గా వస్తున్న కార్తికేయ 2 అంచనాలు అందుకోవడం కాదు.. మంచిపోయేలా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు చందూ.

ఈ చిత్రంలో ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్.. నిఖిల్ కి జంట‌గా న‌టిస్తుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆసక్తికరమైన విషయం డాక్ట‌ర్ కార్తికేయ ప్ర‌యాణం.  శ్రీకృష్ణుడు చ‌రిత్ర‌లోకి ఎంట‌ర‌వుతూ క‌నిపిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఆగస్ట్ 12న విడుదల కానుంది కార్తికేయ 2.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics