ZEE5 దసరా స్పెషల్ గా 'కార్తికేయ 2'
Monday,October 03,2022 - 06:25 by Z_CLU
ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ లేటెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కార్తికేయ 2’ OTT లో రిలీజ్ అవుతుంది. థియేటర్స్ లో ప్రేక్షకులను విపరీతంగా అలరించి 120 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా దసరా స్పెషల్ గా అక్టోబర్ 5న జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. కృష్ణ తత్వానికి ట్రెజర్ హంట్ కాన్సెప్ట్ జోడించి బిగ్ స్కేల్ లో చందూ మొండేటి తెరకెక్కించిన ఈ సినిమా చిన్న,పెద్ద తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంది. క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్‌పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ అడ్వెంచరస్ ఎపిక్ మూవీ ఒటీటీ లో హైయెస్ట్ వ్యూవర్షిప్ అందుకొని అక్కడ కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకోవడం ఖాయమనిపిస్తుంది.

నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి , తులసి ముఖ్య పాత్రల్లో నటించారు. అనుపమ్ ఖేర్ స్పెషల్ రోల్ చేసిన ఈ సినిమాకు కాల భైరవ మ్యూజిక్ అందించగా కార్తీక్ ఘట్టమనేని కెమెరా మెన్ గా వర్క్ చేశాడు. కంటెంట్ తో పాటు టెక్నికల్ గా కూడా మంచి ఎక్స్ పీరియన్స్ ఇచ్చే ఈ సినిమాను OTT లో మిస్ అవ్వకుండా చూడండి.
KAARTHIKEYA2 Streaming on October 5th only on Zee5