18Pages షూటింగ్ అప్ డేట్స్

Tuesday,October 25,2022 - 01:42 by Z_CLU

ఇటీవలే కార్తికేయ-2 సినిమాతో హిట్ అందుకున్న నిఖిల్ సిద్ధార్థ మరియు అనుపమ పరమేశ్వరన్ మరోసారి 18 పేజీస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సుకుమార్ కథ అందించిన ఈ సినిమాకు ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ పల్నాటి  సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు.

సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి GA2 పిక్చర్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఫైనల్ షెడ్యుల్ మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నారు. నిఖిల్ తో పాటు శత్రు కొందరు ఫైటర్స్ పై షూట్ జరుగుతుంది. డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు.  గోపిసుందర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో ఫస్ట్ సింగిల్ త్వరలోనే రిలీజ్ అవ్వనుంది.

 

 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics