18Pages సినిమా రిజల్ట్ నాకు తెలుసు

Tuesday,December 20,2022 - 01:46 by Z_CLU

నిఖిల్ సిద్దార్థ (Nikhil Siddharth) , అనుపమ పరమేశ్వరన్ జంటగా పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో “జీఏ 2” పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా “18 పేజిస్” (18Pages). మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 23న థియేటర్స్ లో రాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈవెంట్ లో హీరో నిఖిల్ మాట్లాడుతూ….” నా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అటెండ్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. 2020 లో మా నాన్నగారిని కోల్పోయాను, అక్కడికి అల్లు అరవింద్ గారు వచ్చారు.ఆయన ఒక ఫాదర్ ఫిగర్. ఆయన చెప్పిన మాటలు నాకు ధైర్యాన్నిచ్చాయి. బన్ని వాసు గారికి థాంక్యూ.

సూర్యప్రతాప్ గారు ఒక చిన్న పాపల ఈ సినిమాను దాచారు. సుకుమార్ గారు తీసిన సినిమాలు నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఆయన రాసిన పాత్రలో కనిపించడం నా అదృష్టం. గెట్ రెడీ ఫర్ డిసంబర్ 23. ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నాను అంటే ఈ సినిమా రిజల్ట్ నాకు తెలుసు. ” అన్నారు.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics