హీరో నిఖిల్ ఇంటర్వ్యూ

Monday,March 05,2018 - 04:30 by Z_CLU

నిఖిల్ ‘కిర్రాక్ పార్టీ’ ఈ నెల 16 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. కన్నడలో సూపర్ హిట్టయిన ఈ సినిమా, తెలుగులోనూ అంతే ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ‘కిర్రాక్ పార్టీ’ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు నిఖిల్. అవి మీకోసం…

 

అదే రీజన్…

‘కిరిక్ పార్టీ’ కన్నడలో సూపర్ హిట్టయింది. ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఇలాంటి డిఫెరెంట్ మూవీ రాలేదు. అందుకే అంత మంచి సినిమాని తెలుగు ఆడియెన్స్ కి అందించాలి అనే ఉద్దేశంతోనే ఈ సినిమా చేశాను.

 

ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు.

ప్రతి ఒక్కరి లైఫ్ లో కాలేజ్ డేస్ చాలా కామన్. ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రతి ఒక్కరూ కాలేజ్ డేస్ ని తలుచుకుంటారు. అంతలా కనెక్ట్ అవుతుందీ సినిమా.

 

చాలా ఇమోషన్స్ ఉన్నాయి.

కిర్రాక్ పార్టీలో చాలా ఇమోషన్స్ ఉంటాయి… ఫ్రెండ్ షిప్ లవ్, హార్ట్ బ్రేకింగ్ తో పాటు ఇంటర్నల్ గా మంచి మెసేజెస్ ఉంటాయి. డిప్రెషన్ నుండి బయటపడటం, విమెన్ కి రెస్పెక్ట్ ఇవ్వడం లాంటి మెసేజెస్ మరీ బోర్ కొట్టించకుండా ట్రెండీ గా ఉంటుందీ సినిమా.

 

అందుకే సంయుక్త హెగ్డే

సంయుక్త హెగ్డే ని అసలు రీప్లేస్ చేయలేకపోయాం. కన్నడలో సినిమా చూసినప్పుడు తన క్యారెక్టర్ ని తను క్యారీ చేసిన తీరు అవుట్ స్టాండింగ్ అనిపించింది. సినిమాలో తక్కిన అన్ని క్యారెక్టర్స్ కి ఆడిషన్స్ జరిగాయి కానీ, సంయుక్త హెగ్డే బిగినింగ్ లో ఫిక్సయ్యాం.

 

తన నవ్వు పెద్ద ఎసెట్.

సినిమాలో సిమ్రాన్ పరాన్జీ ప్లే చేసిన రోల్ కీ రోల్. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలో ఆ అమ్మాయిని ఎవరు చూసినా ఇష్టపడాలి, ఇలాంటి అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలి అనిపించాలి… అంతలా ఎట్రాక్ట్ చేయాలి. అందుకే ఆ క్యారెక్టర్ కి సిమ్రాన్ పర్ఫెక్ట్.

 

ముగ్గురు డైరెక్టర్స్

సినిమాకి చందూ మొండేటి డైలాగ్స్, సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే రాశారు. డైరెక్టర్ శరణ్ ఇద్దరితో కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి ఉన్నారు కాబట్టి ఈ సినిమా సక్సెస్ ని వాళ్ళు కూడా బాధ్యతగా తీసుకున్నారు.

 

ఎంత అవసరమో అంతే…

కన్నడలో ఈ సినిమా రన్ టైమ్ 2: 50 అయితే తెలుగులో 2 : 20 కి కుదించాం. ఒకరకంగా చెప్పాలంటే సినిమాకి ఎంత అవసరమో అంతే ఉంచాం.. ఆల్మోస్ట్ మన నేటివిటీకి తగ్గట్టుగా మార్చే ప్రాసెస్ లో రన్ టైమ్ తగ్గింది.

 

ప్రతి సాంగ్ బావుంటుంది

సాధారణంగా ఒక సినిమాలో ఒక సాంగ్ బావుంటుంది. కానీ ఈ సినిమాలో ప్రతి సాంగ్ చాలా బాగా వచ్చింది. సినిమాలో సిచ్యువేషన్స్, సీన్స్ తో పాటు సాంగ్స్ విజువల్ గా కూడా చాలా బావుంటాయి.

 

ఆ సాంగ్ అంటే చాలా ఇష్టం.

సినిమాలో పాలిటిక్స్ కూడా ఉంటాయి. నేను స్టూడెంట్ లీడర్ గా కనిపిస్తానీ సినిమాలో… అలా ఒక సందర్భంలో ఉండే లాస్ట్ బెంచ్ పార్టీ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం.

 

దెబ్బలు కూడా తగిలాయి.

సినిమాలో 3, 4 ఫైట్స్ కూడా ఉన్నాయి. ఒక ఫైట్ లో చాలా న్యాచురల్ గా ఫైట్ చేయాల్సి వచ్చినప్పుడు దెబ్బలు కూడా తగిలాయి…