Karthikeya 2 వరల్డ్ వైడ్ గా 100 కోట్ల గ్రాస్

Friday,August 26,2022 - 06:47 by Z_CLU

నిఖిల్ సిద్దార్థ్ , చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన ‘కార్తికేయ 2’ భారీ కలెక్షన్స్ కొల్లగొడుతూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంటుంది. ఓ మోస్తారు అంచనాలతో రిలీజైన ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా కోట్లు రాబడుతూ బాక్సాఫీస్ దగ్గర కంటెంట్ తో స్టామినా చూపిస్తుంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా డే 1 నుంచే భారీ వసూళ్ళు అందుకుంటూ దూసుకెళ్తోంది. ఆగస్ట్ 13న థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా రెండో వారానికే వరల్డ్ వైడ్ గా  100 కోట్ల గ్రాస్ క్రాస్ చేసేసింది. సినిమాలో కృష్ణ తత్వంతో పాటు వావ్ ఫ్యాక్టర్స్ ఉండటం , గ్రాండియర్ విజువల్స్ ఆడియన్స్ ని బాగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి.

ముఖ్యంగా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర హిందీ సినిమాలను దాటి భారీ వసూళ్ళు దక్కించుకుంటుంది. ఇప్పటికే అక్కడ 19 కోట్లకు పైగా నెట్ రాబట్టిన ఈ సినిమా వీకెండ్ లో ఇంకా పికప్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్ళుదక్కించుకుంటుంది. వచ్చే సోమవారం కల్లా సినిమా వరల్డ్ వైడ్ గా 130 కోట్ల గ్రాస్ దాటేయడం ఖాయమని ట్రేడ్ అంచనా వేస్తుంది.

నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు కాల భైరవ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ పిక్చర్స్ బేనర్స్ పై TG విశ్వనాథ్ , అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు.