టీజర్ తో రెడీ అవుతున్న నిఖిల్

Saturday,March 18,2017 - 09:36 by Z_CLU

లేటెస్ట్ గా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ తో కెరీర్లో గ్రాండ్ హిట్ అందుకున్న నిఖిల్ మరో సినిమాతో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘కేశవ’ అనే సినిమాలో నటిస్తున్న నిఖిల్ త్వరలోనే ఈ సినిమా టీజర్ తో హంగామా చేయబోతున్నాడు.

 

అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై సస్పెన్స్ రివెంజ్ డ్రామా గా తెరకెక్కుతున్నఈ సినిమా టీజర్ ను మార్చ్ 22న రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. మరి ‘స్వామి రారా’ వంటి సూపర్ హిట్ తరవాత సుధీర్ వర్మ- నిఖిల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న’కేశవ’ టీజర్ సినిమా పై ఎలాంటి అంచనాలను నెలకొల్పుతుందో..చూడాలి.