రివేంజ్ క్రైమ్ డ్రామాతో రెడీ...

Sunday,December 25,2016 - 10:30 by Z_CLU

టాలీవుడ్ లో డిఫరెంట్ సినిమాలతో వరుస హిట్స్ సాధిస్తూ దూసుకెళ్తున్న నిఖిల్ మరో సినిమాతో రెడీ అయ్యాడు. లేటెస్ట్ గా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో కెరీర్ లో గ్రాండ్ అందుకున్న నిఖిల్… ‘కేశవ’ అనే మరో డిఫరెంట్ సినిమాతో త్వరలో థియేటర్స్ కి రాబోతున్నాడు.

keshava-first-look

 

 సుధీర్ వర్మ దర్శకత్వంలో  తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు యూనిట్. ఈ ఫస్ట్ లుక్   అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేసింది. ‘స్వామి రారా’ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత సుధీర్ వర్మ, నిఖిల్ కాంబినేషన్ లో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై రివేంజ్ క్రైం డ్రామా గా రూపొందుతున్న ఈ సినిమా  దాదాపు 80 షూటింగ్ పూర్తి చేసుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్ .