నిఖిల్ పెళ్లి వాయిదా

Friday,April 03,2020 - 12:59 by Z_CLU

కరోనా కారణంగా ఇప్పటికే నితిన్ తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు. ఏప్రిల్ 16న దుబాయ్ లో జరగాల్సిన తన వివాహాన్ని నిరవధికంగా వాయిదా వేసుకుంటున్నట్టు చెప్పాడు. ఇప్పుడు నిఖిల్ కూడా తన పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకున్నాడు.

ఫిబ్రవరిలో నిఖిల్, డాక్టర్ పల్లవి ఎంగేజ్ మెంట్ జరిగింది. ఈ నెలలో హైదరాబాద్ లో పెళ్లి ప్లాన్ చేసుకున్నారు. కానీ కరోనా కారణంగా ఇప్పుడా పెళ్లి వాయిదాపడింది. పరిస్థితులన్నీ కుదుటపడిన తర్వాత తన పెళ్లి తేదీల్ని ప్రకటిస్తానంటున్నాడు నిఖిల్.

ప్రస్తుతం ఈ హీరో సామాజిక సేవలో బిజీగా ఉన్నాడు. వైద్యులు, పోలీసులకు మాస్కులు, శానిటైజర్లు అందిస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న పేదలకు భోజనం పెడుతున్నాడు. ఇలా ఒక రోజుతో ఈ పని ఆపేయలేదు నిఖిల్. ప్రతి రోజూ తనకు తోచినంత ఇలా సహాయం చేస్తూనే ఉన్నాడు.