సెట్స్ పైకి రానున్న నిఖిల్ సినిమాలు

Thursday,June 08,2017 - 04:06 by Z_CLU

ఎక్కడికి పోతావ్ చిన్నవాడా సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నిఖిల్, తాజాగా కేశవ సినిమాతో తన సక్సెస్ రేట్ ను ఇంకాస్త పెంచుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ కు చెందిన చాలామంది దర్శక-నిర్మాతలు ఈ కుర్రహీరోతో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇందులో భాగంగా ఓ హిట్ మూవీ రీమేక్ నిఖిల్ ను వరించింది.

కన్నడలో సూపర్ హిట్ అయిన కిరాక్ పార్టీ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు ఎప్పట్నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు ఈ రీమేక్ కు నిఖిల్ రూపంలో హీరో దొరికాడు. నిఖిల్ అయితే కిరాక్ పార్టీ రీమేక్ కు పర్ ఫెక్ట్ గా సూట్ అవుతాడని మేకర్స్ భావించారు. ఇందులో నటించేందుకు నిఖిల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

కిరాక్ పార్టీతో పాటు మరో సినిమాకు కూడా చూచాయగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నిఖిల్. చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ సినిమాకు రీమేక్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ప్రస్తుతం నాగచైతన్యకు ఓ కథ సిద్ధం చేసే పనిలో చందు మొండేటి బిజీగా ఉన్నాడు. ఆ ప్రాజెక్టు కంప్లీట్ అయిన వెంటనే కార్తికేయ సీక్వెల్ సెట్స్ పైకి వస్తుంది.