నిఖిల్ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్.. మూవీ లాంఛ్

Thursday,March 05,2020 - 12:25 by Z_CLU

గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై నిఖిల్ హీరోగా కొత్త సినిమా లాంఛ్ అయింది. ఈరోజు ఫిలింనగర్ దైవసన్నిధానంలో ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. నిన్న చెప్పినట్టుగానే సినిమా టైటిల్ కూడా రివీల్ చేశారు. ఈ మూవీకి “18 pages” అనే డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేశారు.

అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మాతగా వస్తున్న ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే సుకుమార్ అందించాడు. ఈ మూవీకి కో-ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించబోతున్నాడు సుకుమార్. కుమారి 21F ఫేమ్ సూర్యప్రతాప్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తాడు. రెగ్యులర్ షూటింగ్ డీటెయిల్స్ త్వరలోనే తెలుస్తాయి. గోపీసుందర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.