కొత్త సినిమా ప్రకటించిన నిఖిల్

Sunday,July 16,2017 - 09:10 by Z_CLU

కేశవ సక్సెస్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న నిఖిల్, ఎట్టకేలకు తన కొత్త సినిమా ప్రకటించాడు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాబోతోంది ఆ మూవీ. ఈ చిత్రం ద్వారా శరణ్ కొప్పిశెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. యువ దర్శకులు సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే, మరో యువ దర్శకుడు చందూ మొండేటి సంభాషణలు సమకూర్చనుండడం విశేషం.

నిఖిల్ తో సుధీర్ వర్మ “స్వామి రారా, కేశవ” లాంటి సూపర్ హిట్స్ ను తెరకెక్కించగా.. చందూ మొండేటి “కార్తికేయ” లాంటి బ్లాక్ బస్టర్ ను ఇచ్చి ఉండడం విశేషం. ఈ ముగ్గురి కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందనుండడం.. ఇలాంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఎ.కె.ఎంటర్ టైన్మెంట్ లాంటి సంస్థ నిర్మించనుండడం హాట్ టాపిక్ గా మారింది.

అజనీష్ లోక్నాధ్ సంగీత సారధ్యం వహించనున్న ఈ చిత్రంలో నిఖిల్ సరసన ఇద్దరు కథానాయికలు నటించనున్నారు. చిత్ర బృందం సరికొత్త టాలెంట్ ను పరిశ్రమకు పరిచయం చేసే ఉద్దేశ్యంతో.. 8 మంది అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు రోల్స్ కోసం క్యాస్టింగ్ కాల్ ను నిర్వహించనుంది.