అప్పుడే కూతురికి పేరు కూడా పెట్టేశాడు

Tuesday,May 30,2017 - 05:02 by Z_CLU

కేశవ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న నిఖిల్ తన ఫ్యూచర్ సినిమాల గురించి, ప్లానింగ్ గురించి మాట్లాడుతూనే చాలా ఇంటరెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు. ముఖ్యంగా పెళ్ళి ప్రస్తావన వచ్చినప్పుడు పెళ్ళికి ఇంకా చాలా టైముందని చెప్తూనే, పెళ్ళి గురించి, తన ఫ్యూచర్ డాటర్ కి ఏం పేరు పెట్టుకోవాలనుకుంటున్నాడో కూడా షేర్ చేసుకున్నాడు.

పెళ్ళి అంటే లైఫ్ లాంగ్ నిలిచిపోయే వండర్ ఫుల్ రిలేషన్ షిప్ అని చెప్పుకున్న నిఖిల్, ఒక్కసారి పెళ్ళి చేసుకుంటే జీవితాంతం ఆ మాట మీద ఉంటూ, ఆ రిలేషన్ ని కాపాడుకోవాలి అని చెప్పుకున్నాడు. దాంతో పాటు ఇంకా కనీసం పెళ్ళి కూడా కాకుండానే, ఫ్యూచర్ లో తనకు కూతురు పుట్టాలనుకుంటున్నానని, తనకు ‘మాయ’ అనే పేరు కూడా పెట్టుకోవాలనుకుంటున్నానని ఎగ్జైటెడ్ గా చెప్పుకున్నాడు నిఖిల్.

స్టోరీ సెలెక్షన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ కరియర్ ని ప్లాన్ చేసుకుంటున్న నిఖిల్, తన పర్సనల్ లైఫ్ విషయంలోనూ అంతే క్లారిటీగా ఉన్నాడు.