నిఖిల్ సినిమా టైటిల్ మారింది

Monday,February 04,2019 - 01:16 by Z_CLU

నిఖిల్ సినిమా ‘ముద్ర’ టైటిల్ మారింది. తమిళ బ్లాక్ బస్టర్ ‘కణిదన్’ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పుడు ‘అర్జున్ సురవరం’ గా థియేటర్ల లోకి రానుంది. మార్చి 29 న థియేటర్ల లోకి రానున్న ఈ సినిమాలో నిఖిల్ ప్లే చేస్తున్న క్యారెక్టర్ పేరునే టైటిల్ గా ఫిక్సయ్యారు మేకర్స్.

గత కొన్ని రోజులుగా ఈ సినిమా టైటిల్ చుట్టూ క్రియేట్ అయిన డిస్టబెన్సెస్ కారణంగా, సినిమా టైటిల్ ని అఫీషియల్ గా మార్చేశారు మేకర్స్. అయితే సోషల్ మీడియాలో ఈ టైటిల్ కి మరింత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ‘ముద్ర’ కన్నా, ‘అర్జున్ సురవరం’ మరింత పవర్ ఫుల్ గా ఉందంటున్నారు ఫ్యాన్స్.

నిఖిల్ ఈ సినిమాలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా కనిపించనున్నాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. స్యామ్ సి.యస్. ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. T. సంతోష్ సినిమాకి డైరెక్టర్. ఔరా సినిమాస్ పివిటి మ‌రియు మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్‌పి బ్యానర్స్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది.