రాజమండ్రిలో నిఖిల్ "కిర్రాక్"

Wednesday,December 13,2017 - 10:58 by Z_CLU

కన్నడలో హిట్ అయిన కిరిక్ పార్టీని తెలుగులో నిఖిల్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రాజమండ్రిలో జరుగుతోంది. ఇప్పటికే 70శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు తాజాగా విడుదల తేదీ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. అందుకే ఫిబ్రవరి 9 రిలీజ్ డేట్ ను అందుకునేందుకు శరవేగంగా సినిమా పని పూర్తిచేస్తున్నాడు.

ఈ సినిమాతో సంయుక్త హెగ్డే, సిమ్రాన్ పరాన్జీ హీరోయిన్లుగా పరిచయమౌతున్నారు. దర్శకుడు శరణ్ కొప్పిశెట్టికి కూడా డైరక్టర్ గా ఇదే ఫస్ట్ మూవీ. సుధీర్ వర్మ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందిస్తుండగా, చందు మొండేటి డైలాగ్స్ రాసిచ్చాడు.

కేశవ సక్సెస్ తర్వాత నిఖిల్ చేస్తున్న సినిమా ఇది. పైగా సూపర్ హిట్ సినిమాకు రీమేక్ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ సినిమా ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది.