నిఖిల్ సినిమా లేటెస్ట్ అప్ డేట్స్

Monday,November 27,2017 - 05:54 by Z_CLU

డిఫెరెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన నిఖిల్ ప్రస్తుతం ‘కిరిక్ పార్టీ’ మూవీ రీమేక్ మూవీతో బిజీ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే హైదరాబాద్, ఉత్తరాఖండ్ తో పాటు విజయవాడలోని ఇంట్రెస్టింగ్ లొకేషన్ లలో షూటింగ్ జరుపుకున్న సినిమా యూనిట్,  ప్రస్తుతం హైదరాబాద్ లోని ఎగ్జోటిక్ లొకేషన్ లలో షూటింగ్ జరుపుకుంటుంది. వారం రోజుల పాటు జరగనున్న ఈ రెగ్యులర్  షూటింగ్ లో సినిమాలోని కీలక సన్నివేశాలను తెరకెక్కించే ప్రాసెస్ లో ఉంది సినిమా యూనిట్.

 

ఈ సినిమాలో నిఖిల్ సరసన సంయుక్త హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ట్యాలెంట్ హబ్ లా మారిన ఈ సినిమాకి చందూ మొండేటి డైలాగ్స్ రాస్తుండగా, సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే రాశాడు. శరణ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంయుక్త హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అనిల్ సుంకర ప్రొడ్యూసర్.