GA2లో నిఖిల్ మూవీ.. రేపే లాంఛ్

Wednesday,March 04,2020 - 03:12 by Z_CLU

గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై నిఖిల్ హీరోగా ఓ సినిమాను ఆల్రెడీ ఎనౌన్స్ చేశారు. ఇప్పుడా సినిమా సెట్స్ పైకి రాబోతోంది. రేపు ఈ మూవీని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. అంతేకాదు.. రేపు ఉదయం 9 గంటలకు సినిమా టైటిల్ ను కూడా రివీల్ చేయబోతున్నారు.

గీతాఆర్ట్స్-2 బ్యానర్ లో నిఖిల్ కు ఇదే ఫస్ట్ మూవీ. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకు కథ అందించడంతో పాటు స్క్రీన్ ప్లే కూడా సమకూర్చి పెట్టాడు. బౌండెడ్ స్క్రిప్ట్ రెడీగా ఉంది. కుమారి 21-F ఫేమ్ సూర్యప్రతాప్ ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహించబోతున్నాడు.

అల్లు అరవింద్ ప్రజెంట్ చేయనున్న ఈ సినిమాను గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై బన్నీ వాస్ ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. సుకుమార్ కూడా సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మూవీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రేపు బయటకొస్తాయి.

మొన్ననే కార్తికేయ-2 స్టార్ట్ చేశాడు నిఖిల్. రేపు GA2 పిక్చర్స్ లో సినిమా లాంఛ్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల్ని సైమల్టేనియస్ గా పూర్తిచేయాలనేది నిఖిల్ ప్లాన్.