నిఖిల్ చేతిలో అరడజను సినిమాలు

Tuesday,June 02,2020 - 02:07 by Z_CLU

నిన్న పుట్టిన రోజు జరుపుకున్న నిఖిల్ త్వరలోనే రెండు సినిమాల షూటింగ్స్ లో పాల్గొనబోతున్నాడు. లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన ‘కార్తికేయ 2′, ’18 పేజెస్’ సినిమా షూటింగ్స్ ను బ్యాక్ టు బ్యాక్ స్టార్ట్ చేయబోతున్నాడు. అయితే ఈ రెండు సినిమాలతో పాటు నిఖిల్ మరో 4 సినిమాలు రెడీ చేసుకున్నాడని టాక్.

సుధీర్ వర్మతో ఇప్పటికే రెండు సినిమాలు చేసిన నిఖిల్ ముచ్చటగా మూడో సినిమా ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం రెడీ టూ షూట్ మోడ్ లో ఉన్న రెండు సినిమాలు అవ్వగానే సుధీర్ వర్మ డైరెక్షన్ లో సినిమా ఉంటుందట.

ఇక ’18 పేజెస్’ కాకుండా ‘గీతా ఆర్ట్స్ 2’ బ్యానర్ లో మరో సినిమా కూడా సైన్ చేసాడట. అలాగే ఇద్దరు కొత్త దర్శకులతో 2 సినిమాలు ప్లాన్ చేస్తున్నాడట. అవి ప్రస్తుతం స్క్రిప్టింగ్ దశలో ఉన్నాయని తెలుస్తుంది.

ఇలా ఓ అరడజను సినిమాలు లైన్ లో పెట్టుకొని కెరీర్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తూ ముందుకెళ్తున్నాడు ఈ యంగ్ హీరో.