మార్చి 16 న రిలీజవుతున్న నిఖిల్ ‘కిర్రాక్ పార్టీ’

Friday,February 23,2018 - 04:30 by Z_CLU

నిఖిల్ ‘కిర్రాక్ పార్టీ’ రిలీజ్ డేట్ ప్రీ పోన్ అయింది. మార్చి 22 న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాని వారం రోజులు ముందుగా థియేటర్స్ లోకి తీసుకువచ్చే ప్లాన్ లో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్. అల్టిమేట్ యూత్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 16 న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.

ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ ప్రాసెస్ స్పీడ్ పెంచిన సినిమా యూనిట్, రేపు ‘గురువారం’ అనే లవ్ సాంగ్ ని రిలీజ్ చేయనుంది. కన్నడ సూపర్ హిట్ మూవీ ‘కిర్రాక్ పార్టీ’ కి రీమేక్ గా అదే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులోను అదే రేంజ్ సక్సెస్ సాధించడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు సినిమా యూనిట్.

AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా శరణ్ కొప్పిశెట్టి డైరెక్షన్ లో తెరకెక్కింది. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.