'కేశవ' ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Friday,May 26,2017 - 05:00 by Z_CLU

ఇటీవలే ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించి గ్రాండ్ హిట్ అందుకున్న నిఖిల్ లేటెస్ట్ గా ‘కేశవ’ తో మరో సారి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతూ దూసుకుపోతున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రివేంజ్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కిన ‘కేశవ’ తొలి వారం రోజుల్లోనే 16 కోట్ల గ్రాస్ సాధించి ఔరా అనిపిస్తుంది..

నిఖిల్ సరసన రీతూ వర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా నిర్మించారు. మొదటి షో నుంచే పాజిటీవ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ప్రెజెంట్ థియేటర్స్ లో సందడి చేస్తూ అందరినీ ఎట్రాక్ట్ చేస్తుంది. తొలి వారం లోనే 16 కోట్ల గ్రాస్ సాధించి సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా సెకండ్ వీక్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో..చూడాలి.