

Saturday,May 21,2022 - 04:11 by Z_CLU
హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జూలియన్ ఎస్ట్రాడా తో పాటు ఈ యాక్షన్ సెట్స్ లో మేరీ కోమ్, శకుంతలా దేవి, తాన్హాజీ వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలలో భాగమైన బాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కైకో నకహరా కనిపించారు. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ లీ విటేకర్ యాక్షన్ సన్నివేశాలను సూపర్ వైజ్ చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు మకరంద్ దేశ్‌పాండే పాటు అభినవ్ గోమతం, ఐశ్వర్యా మీనన్, సన్యా ఠాకూర్‌లు షూటింగ్‌లో పాల్గొంటున్నారు.
ఇటీవల విడుదలైన ఈ సినిమా టైటిల్ పోస్టర్ ఆసక్తిని రేకెత్తించింది. తన మొదటి పాన్ ఇండియా చిత్రంగా విడుదల కాబోతున్న ‘స్పై’లో సరికొత్త లుక్, భిన్నమైన పాత్రలో అలరించనున్నారు నిఖిల్ .
పూర్తి యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి నిర్మాత కె రాజశేఖర్ రెడ్డి కథను కూడా అందించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా, అర్జున్ సూరిశెట్టి ఆర్ట్ డైరెక్టర్ గా, రవి ఆంథోని ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. ఎడ్ ఎంటర్టైన్మెంట్స్ సిఈవోగా చరణ్ తేజ్ ఉప్పలపాటి ఈ ప్రాజెక్ట్ మొత్తం ప్రొడక్షన్ పనులను నిర్వహిస్తున్నారు.
తెలుగు, హిందీ, తమిళం, కన్నడ ,మలయాళ భాషల్లో 2022 దసరాకు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.
Thursday,August 24,2023 07:36 by Z_CLU
Tuesday,August 22,2023 12:43 by Z_CLU
Friday,August 18,2023 04:06 by Z_CLU
Friday,August 18,2023 03:55 by Z_CLU