క్లారిటీ ఇచ్చిన Nikhil

Wednesday,September 16,2020 - 01:48 by Z_CLU

హీరో Nikhil Siddharth త్వరలోనే మెగా ఫోన్ పట్టి దర్శకుడిగా మారబోతున్నాడనే ప్రచారం జరుగుతుంది. ఓ ఇంటర్వ్యూ లో తన మనసులో మాట బయటపెట్టడంతో నిఖిల్ ఉన్నపళంగా డైరెక్టర్ చెయిర్ లో కుర్చోబోతున్నాడని కథనాలు మొదలయ్యాయి. అయితే దీనిపై నిఖిల్ స్పందించి క్లారిటీ ఇచ్చాడు.

“మీ ప్రేమకు సపోర్ట్ కి ధన్యవాదాలు … చిన్నపిల్లల కాన్సెప్ట్ తో బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేశాను. కానీ ఆ సినిమాను నేను డైరెక్ట్ చేయను” అంటూ తెలిపాడు.

అక్టోబర్ లేదా నవంబర్ నుండి ’18 Pages’, ‘Karthikeya2’ షూటింగ్స్ మొదలు కానున్నాయని ఈ బిజీ షెడ్యుల్ లో తను రాసుకున్న కథను డైరెక్ట్ చేసే టైం లేదని సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేసాడు యంగ్ హీరో. నిఖిల్ ఇచ్చిన క్లారిటీతో డైరెక్టర్ గా మారనున్నాడనే కథనాలకు ఫుల్ స్టాప్ పడింది.