పెళ్ళి విషయంలో క్లారిటీ ఇచ్చిన నిఖిల్

Friday,September 01,2017 - 03:32 by Z_CLU

నిఖిల్ పెళ్లి విషయంలో చక్కర్లు కొడుతున్న న్యూస్ కి స్టైల్ గా ఫుల్ స్టాప్ పెట్టేశాడు నిఖిల్. నిఖిల్ కి ఆల్ రెడీ ఎంగేజ్ మెంట్ అయిపోయిందని, ఈ డిసెంబర్ లో పెళ్లి చేసుకోనున్నాడని మీడియాలో హెడ్ లైన్స్ గా మారిన రూమర్స్ ని కొట్టి పడేశాడు నిఖిల్.

బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ తో పక్కా ప్లాన్డ్ గా ఉన్న నిఖిల్, ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, ఎంగేజ్ మెంట్ గురించి వచ్చిన న్యూస్ కంప్లీట్ గా ఫేక్ అని క్లారిటీ ఇచ్చేశాడు. ప్రస్తుతం AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో శరణ్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న నిఖిల్ , చందు మొండేటి తో కార్తికేయ 2 సినిమాతో బిజీగా ఉన్నాడు నిఖిల్.