Nikhil - షూటింగ్స్ కు రెడీ అని ప్రకటించిన హీరో
Monday,June 14,2021 - 12:02 by Z_CLU
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతుండడంతో హీరోలంతా ఒక్కొక్కరుగా తమ సినిమాల్ని సెట్స్ పైకి తీసుకొస్తున్నారు. హీరో నితిన్ ఆల్రెడీ తను నటిస్తున్న మ్యాస్ట్రో సినిమాను ఇవాళ్టి నుంచి సెట్స్ పైకి తీసుకొచ్చాడు. ఇప్పుడీ లిస్ట్ లోకి హీరో నిఖిల్ కూడా చేరబోతున్నాడు.

తను షూటింగ్స్ కు రెడీ అని ప్రకటించాడు నిఖిల్. త్వరలోనే కార్తికేయ-2, 18-పేజెస్ సినిమాల్ని సెట్స్ పైకి తీసుకొస్తానని అంటున్నాడు. కార్తికేయ-2 కోసం బాడీ బిల్డింగ్ చేశాడు నిఖిల్. దానికి సంబంధించి కొన్ని స్టిల్స్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు.
చందు మొండేటి దర్శకత్వంలో రాబోతోంది కార్తికేయ-2. సూపర్ హిట్టయిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా, మరిన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ మూవీ వస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టి.జి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మాతలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మూవీకి సంబంధించి ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా షెడ్యూల్ మొదలవుతుంది.

ఇక నిఖిల్ నటిస్తున్న మరో సినిమా 18-పేజెస్. ఇందులో కూడా నిఖిల్ సరసన అనుపమనే హీరోయిన్ గా నటిస్తోంది. జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ను కూడా త్వరలోనే మొదలుపెట్టబోతున్నాడు నిఖిల్. పల్నాటి సూర్యప్రతాప్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాకు బన్నీ వాస్ నిర్మాత. ఈ మూవీకి సంబంధించి రీసెంట్ గా రిలీజైన ఫస్ట్ లుక్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
- – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics